భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు
కోల్పోయి 233 పరుగులు చేసింది భారత బౌలర్ రవీంద్ర జడేజాకు ఐదు వికెట్లు లభించాయి.
234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి భారత జట్టు రోహిత్, కోహ్లీ ల వికెట్లు కోల్పోయి 39.1 బంతుల్లో
విజయం సాధించింది. ధావన్ 102, దినేష్ కార్తీక్ 51 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ, దినేష్ కార్తీక్, రోహిత్ లు అర్ధ సెంచరీలు చేయడంతో వెస్టిండీస్ జట్టుపై భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శిఖర్ ధావన్ సిక్సర్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. శిఖర్ ధావన్ 102 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 102 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
భారత బౌలర్ రవీంద్ర జడేజాకు 'మ్యాన్ ఆఫ్ ధీ మ్యాచ్' లభించింది
No comments:
Post a Comment