Welcome to Latest Telugu News | తాజా తెలుగు వార్తల బ్లాగుకు స్వాగతం మరియు సుస్వాగతం

ప్రపంచం - వార్తలు

ఇండియా - వార్తలు

Sunday, June 23, 2013

India won the ICC Champions Trophy 2013

భారత్ ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొంది.

వర్షం కారణంగా మ్యాచును 20 ఓవర్లకు కుదించారు.

ముందుగా భారత్ బ్యాటింగ్ చేసి 130 పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్ ముందుంచింది.
విరాట్ కోహ్లి 43, రవీంద్ర జడేజా 33 పరుగులు చేసారు. బొపారాకు 3 వికెట్లు దక్కాయి.

తరువాత లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ పోరు 124 పరుగలకే ముగిసింది.
మోర్గాన్ 33, బొపారా 30 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరిని ఇశాంత్ శర్మ ఔట్ చేసాడు. మ్యాచు  చివరి నాలుగు ఓవర్లు ఉత్కంటబరితంగా సాగింది. చివరకు విజయం భారత్ ను వరించింది.

Uttarakhand floods


Friday, June 14, 2013

Naxals attack train in Bihar

బీహార్‌లో నక్సల్స్  రైలుపై మెరుపు దాడి
సుమారు 150 మంది సాయుధ నక్సల్స్ గురువారం బీహార్‌లోని నక్సల్స్ ప్రభావిత జిల్లా జముయిలో పాట్నా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కుందర్‌హాల్ట్ వద్దకు చేరుకోగానే పట్టపగలే మెరుపు దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఆర్‌పిఎఫ్ జవాను సహా ముగ్గురు చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నక్సల్స్ ప్రయాణికులను దోచుకోవడమే కాక ఆర్‌పిఎఫ్ జవాన్లనుంచి ఆయుధాలను సైతం దోచుకుని పారిపోయారు. గురువారం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల ప్రాంతంలో సుమారు 150 మంది సాయుధ నక్సల్స్ ధన్‌బాద్-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను జముయి, మనన్‌పూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న కుందన్ హాల్ట్ వద్ద బలవంతంగా ఆపేసి దాదాపు అరగంట సేపు ప్రయాణికులపైన, ఆర్‌పిఎఫ్ జవాన్లపైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) ఎస్‌కె భరద్వాజ్ చెప్పారు

Tuesday, June 11, 2013

India won by 8 wickets against West Indies in Champions Trophy League Match


భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు 

కోల్పోయి 233 పరుగులు చేసింది భారత బౌలర్ రవీంద్ర జడేజాకు ఐదు వికెట్లు లభించాయి.  

234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి భారత జట్టు రోహిత్, కోహ్లీ ల వికెట్లు కోల్పోయి 39.1 బంతుల్లో 

విజయం సాధించింది. ధావన్ 102, దినేష్ కార్తీక్ 51 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

 భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ, దినేష్ కార్తీక్, రోహిత్ లు అర్ధ సెంచరీలు చేయడంతో వెస్టిండీస్ జట్టుపై భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శిఖర్ ధావన్ సిక్సర్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. శిఖర్ ధావన్ 102 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 102 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 


 భారత బౌలర్ రవీంద్ర జడేజాకు 'మ్యాన్ ఆఫ్ ధీ మ్యాచ్' లభించింది


Sunday, June 9, 2013

2013 French Open Title Winner is Rafael Nadel

 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తనకు తిరుగులేదని రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను తన దేశానికే చెందిన డేవిడ్ ఫెరర్‌ను 6-3, 6-2, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసి, ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను అందుకున్నాడు.

Friday, June 7, 2013

Daily telugu news

Telugu News updated
తెలుగులో వార్తలు ఎప్పటికప్పుడు. 

వినోదం - వార్తలు

ఆంధ్రప్రదేశ్ - వార్తలు